తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ ఆసుపత్రి ఔట్​సోర్సింగ్​ సిబ్బంది ఆందోళన.. ఎందుకంటే? - గాంధీ ఆసుపత్రి ఔట్​సోర్సింగ్​ సిబ్బంది ఆందోళన వార్తలు

గాంధీ ఆసుపత్రి ఔట్​సోర్సింగ్​ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

Gandhi Hospital Outsourcing Staff Concerned .. Because?
గాంధీ ఆసుపత్రి ఔట్​సోర్సింగ్​ సిబ్బంది ఆందోళన.. ఎందుకంటే?

By

Published : Jul 14, 2020, 10:09 AM IST

Updated : Jul 14, 2020, 11:32 AM IST

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలని డిమాండ్​ చేస్తూ గాంధీ ఆసుపత్రి ఔట్​సోర్సింగ్​ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గత కొన్ని రోజులుగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా.. అవి సఫలం కావడం లేదని వారు ఆరోపించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నా.. ప్రభుత్వం గుర్తించడం లేదని వాపోయారు. వెంటనే జీతాలు పెంచి తమను ఆదుకోవాలని కోరారు. ఔట్​సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి.. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు.

గాంధీ ఆసుపత్రి ఔట్​సోర్సింగ్​ సిబ్బంది ఆందోళన.. ఎందుకంటే?

ఇదీచూడండి: మా గోడు పట్టించుకోరూ ప్లీజ్​: నెట్టింట కరోనా బాధితుల విన్నపం

Last Updated : Jul 14, 2020, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details