తెలంగాణ

telangana

ETV Bharat / state

తమ విధులను క్రమబద్ధీకరించాలని గాంధీ నర్సుల ఆందోళన - gandhi hospital nurses

14 ఏళ్లుగా గాంధీ ఆస్పత్రిలో అవుట్​సోర్సింగ్​ విధానంలో పనిచేస్తున్నా... తమ విధులను క్రమబద్ధీకరించటం లేదని నర్సులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్​లో కోఠి డీఎంఈ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.

gandhi hospital nurses protset at koti dme office
gandhi hospital nurses protset at koti dme office

By

Published : Jul 10, 2020, 2:54 PM IST

హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం ఎదుట గాంధీ నర్సులు ఆందోళనకు దిగారు. గాంధీ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ విధానంలో 14 ఏళ్లుగా పని చేస్తున్నామని... తమ విధులను క్రమబద్ధీకరించాలని వివిధ రూపాల్లో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయానికి జీతాలు రాకపోవడం వల్ల కుటుంబ పోషణ భారమవుతోందన్నారు. ప్రభుత్వ అధికారులు, గుత్తేదారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. క్రమబద్దీకరణపై సంబంధింత అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కదిలే ప్రసక్తే లేదని నర్సులు బైఠాయించారు.

ఇవీ చూడండి:షేక్​పేట ఘటనలో కొత్త కోణం.. ఏసీబీ అధికారులకే మస్కా..

ABOUT THE AUTHOR

...view details