గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమించిన పొరుగు సేవల సిబ్బంది - Neighborhood services staff stop the strike in Gandhi hospital
17:10 July 15
గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమించిన పొరుగు సేవల సిబ్బంది
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పొరుగు సేవల సిబ్బంది సమ్మె విరమించారు. తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. డీఎంతో చర్చలు సఫలం కావడం వల్ల సిబ్బంది విధుల్లోకి చేరారు. షిప్టుల వారీగా నెలలో 15 రోజుల విధులకు అధికారులు అంగీకరించారు. కొవిడ్ విధుల్లో ఉన్నవారికి రోజుకు రూ.300 చొప్పున అదనపు భత్యం చెల్లించేందుకు అధికారులు ఒప్పుకున్నారు.
గాంధీ ఆస్పత్రి పొరుగు సేవల సిబ్బంది ఈరోజు ఉదయం నుంచి విధులు బహిష్కరించి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు విధుల్లోకి వచ్చేదిలేదని తేల్చిచెప్పారు. వీరి సమ్మెతో సౌకర్యాలు కల్పించే వారు లేక రోగులు ఇబ్బందులు పడ్డారు. ఓపీ, ఇతర వార్డుల్లో సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారి జీతాల పెంపు సమస్యకు పరిష్కారం లభించింది.
ఇదీ చూడండి :60 లక్షలతో రోడ్ల నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన