కరోనా ఆపత్కాలంలో తమ ప్రాణాలు లెక్కచేయకుండా సేవలందిస్తోన్న వైద్యులపై కొందరు బాధితులు, వారి కుటుంబ సభ్యులు దాడికి దిగుతున్నారు. ఏప్రిల్ 1న వైరస్ సోకిన వ్యక్తి బంధువులు వైద్యులపై దాడి చేయడం వల్ల ఆసుపత్రికి భద్రత పెంచారు. ప్రత్యేక రక్షణ దళం పోలీసులతోపాటు 250 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు ఏసీపీలు పర్యవేక్షిస్తున్నారు. సీపీ అంజనీకుమార్ స్వయంగా వైద్యులతో మాట్లాడుతున్నారు. ఇంత వ్యవస్థ ఉన్నా రెండోసారి వైద్యులపై దాడి జరగడం గమనార్హం.
భద్రత ఉంది.. అయినా ఆగని దాడులు - assault on doctors in telangana
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న గాంధీ ఆసుపత్రిలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఉన్నా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏఎంసీ వార్డులో ఈనెల 9న జూనియర్ వైద్యులపై జరిగిన దాడి ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. తమపై దాడులు జరుగుతుంటే ఎలా పనిచేస్తామంటూ జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు.

భద్రత ఉన్నా.. ఆగని దాడులు
ఆసుపత్రిలో మూడంచెల భద్రత ఉంది.. అవుట్‌పోస్టు కూడా ఉంది. రోగి చనిపోయినప్పుడు భావోద్వేగాన్ని తట్టుకోలేక బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పోలీసులు వచ్చేలోపే దాడులకు దిగుతున్నారు. మంగళవారం రాత్రి ఘటనలో పోలీస్ అధికారులు అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటలు అక్కడే ఉండి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
- ఇదీ చూడండి:మిడతల దండు దాడి చేసినా.. పంట నష్టం జరగలేదు!