తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ ఆస్పత్రిలో రానున్న అదనపు చిన్నపిల్లల వార్డు

గాంధీ ఆస్పత్రికి రాబోవు కాలంలో మంచి రోజులు రానున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. గాంధీలో అదనంగా చిన్నపిల్లల వార్డును, కొత్తగా లేబర్ వార్డులు రానున్నాయన్నారు. కుటుంబ సంక్షేమ శాఖ​ కమిషనర్​ యోగితారాణా ఆస్పత్రిని సందర్శించారు.

Gandhi hospital development works in hyderabad
గాంధీ ఆస్పత్రిలో రానున్న అదనపు చిన్నపిల్లల వార్డు

By

Published : Dec 20, 2019, 4:33 PM IST

హైదరాబాద్​ గాంధీ హాస్పత్రిని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ యోగితరాణా సందర్శించారు. గాంధీ మార్చురీకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో గ్రౌండ్ ప్లస్ 2 కొత్త భవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ. 55 కోట్లతో లేబర్ వార్డు చిన్న పిల్లల వార్డు కొత్తగా నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం గాంధీలో గైనిక్ వార్డులో 370 మంచాలు ఉండగా మరో 200 మంచాల పట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గాంధీ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండడానికి కొత్త బిల్డింగులు కడుతున్నట్లు బిల్డింగ్ ఆర్కిటెక్ట్​ ఉషారెడ్డి తెలిపారు. మాన్ పవర్ లోటు ఉన్నప్పటికీ ఈ విషయాన్ని మళ్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సూపరింటెండెంట్ చెప్పారు.
మొదటి దశగా రూ. 55 కోట్లతో గ్రౌండ్ ప్లస్ 2 .. ఆ తర్వాత మరో రూ 55 కోట్లతో అది భవనం నిర్మిస్తారు.. ఇలా మొత్తం ఏడు అంతస్తుల పూర్తి భవనాన్ని రెండు సంవత్సరాలల్లో పూర్తి చేయనున్నట్లు ఆర్కిటెక్ చెప్పారు. ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక చర్యలు తీసుకోనున్నామని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.

గాంధీ ఆస్పత్రిలో రానున్న అదనపు చిన్నపిల్లల వార్డు

ABOUT THE AUTHOR

...view details