కోల్కతాలో జూనియర్ వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ ఆస్పత్రి వద్ద వైద్యులు నిరసనకు దిగారు. అత్యవసర సేవలు తప్ప మిగతా అన్నీ సేవలను నిలిపివేశారు. ఈ నిరసన రేపు ఉదయం ఆరుగంటల వరకు కొనసాగుతోందని డాక్టర్లు స్పష్టం చేశారు. కోల్కతాలో ఘనటనకు కారకులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్లకు రక్షణ కల్పించాలని...అలాగే దాడులను అరికట్టాలన్నారు. నిర్భయ చట్టం మాదిరిగానే వైద్యుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని తీసుకరావాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
'నిర్భయ చట్టం మాదిరిగానే... వైద్యుల రక్షణ చట్టం' - 'నిర్భయ చట్టం మాదిరిగానే...వైద్యుల రక్షణ చట్టం'
వైద్యులపై దాడులను ఖండిస్తూ గాంధీ ఆస్పత్రి వద్ద వైద్యులు నిరసనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే దేశవ్యాప్తంగా డాక్టర్లకు రక్షణ కల్పించాలని...బలమైన చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.
'నిర్భయ చట్టం మాదిరిగానే...వైద్యుల రక్షణ చట్టం'