తెలంగాణ

telangana

ETV Bharat / state

సాధారణ పేషంట్ల మధ్య స్వైన్​ ప్లూ రోగికి చికిత్స

గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మాములు పేషంట్ల మధ్య స్వైన్​ ప్లూ రోగికి చికిత్స అందిస్తున్నారు. ఇతరులకు స్వైన్​ సోకే ప్రమాదం ఉందని తెలిసినా అలానే చికిత్స చేస్తున్నారు. కనీసం మాస్క్​లు కూడా అందుబాటులో ఉంచలేదు.

Gandhi doctors negligence
గాంధీ ఆస్పత్రి

By

Published : Feb 19, 2020, 9:52 AM IST

నిర్లక్ష్యానికి తార్కాణంగా మారింది గాంధీ ఆస్పత్రి. సాధారణ పేషంట్ల మధ్యలో స్వైన్ ప్లూ రోగికి బెడ్ కేటాయించారు. మిగతా పేషంట్లు ఉన్న వార్డులోనే స్వైన్ ఫ్లూతో బాధ పడుతున్న రోగికి చికిత్స అందిస్తున్నారు. కనీసం మాస్క్​లు కూడా అందుబాటులో ఉంచలేదు.

స్వైన్ ప్లూ పేషంట్ గర్భిణి అయినప్పటికీ వైద్యులు, నర్సులు పట్టించుకోవడంలేదని రోగి తరఫు వారు ఆరోపిస్తున్నారు. వైద్యులు, నర్సులు నిద్ర లేపిపితే కసురుకుంటున్నారని చెబుతున్నారు.

గాంధీ ఆస్పత్రి

ఇదీ చూడండి :జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!

ABOUT THE AUTHOR

...view details