'గాంధీ ఆశయాలకు అనుగుణంగా జీవించాలి' - మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
ప్రతిఒక్కరు మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఆదర్శంగా జీవించాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గాంధీజీ 150వ జయంతి వేడుకలను రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గాంధేయం బీఈడీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.
గాంధీజీ 150వ జయంతి వేడుకలు
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుంట్లూరులో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15 మంది చేనేత కార్మిక మహిళలు రాట్నంతో నూలు ఒడికారు. 350 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. గాంధీ వేషధారణలో ఉన్న బాలుడు నూలు ఒడుకుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఎప్పటికైనా ప్రజలు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా జీవించి ఆదర్శంగా ఉండాలని ప్రభాకర్ రెడ్డి సూచించారు.