లాక్డౌన్ కారణంగా ప్రజలెవరూ ఆకలికి అలమటించకూడదనే ఉద్దేశంతో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. మైసూరులో నిరుపేదలకు రూ. 25 లక్షల విలువైన నిత్యావసరాలను జిల్లా కలెక్టర్కు అందజేశారు.
పేదలకు సచ్చిదానంద స్వామి నిత్యావసరాల పంపిణీ - ganapati sachidananda distributed daily essentials to poor
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మైసూరు నగరంలోని నిరుపేదలకు పంచిపెట్టాలని రూ. 25 లక్షల విలువైన నిత్యావసరాలను కలెక్టర్ ద్వారా నగర సహాయ నిధికి అందజేశారు. ఇవే కాక అవధూత దత్త పీఠం ద్వారా ఎందరో పేదలకు రోజూ ఆహారాన్ని అందజేస్తున్నారు.
![పేదలకు సచ్చిదానంద స్వామి నిత్యావసరాల పంపిణీ ganapati sachidananda swamy distributed daily essentials to poor at mysore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6863479-thumbnail-3x2-sachidansnds.jpg)
పేదలకు సచ్చిదానంద స్వామి నిత్యావసరాల పంపిణీ
30 వేల కిలోల బియ్యం, మూడు వేల కిలోల పప్పు, 3 వేల లీటర్ల నూనెను మైసూరు సహాయ నిధికి అందించారు. ఇదే కాకుండా బెంగళూరు, హైదరాబాద్, ఆకివీడు, వరంగల్ తదితర ప్రాంతాల్లో ఉన్న అవధూత దత్త పీఠం ద్వారా నిరుపేదలకు రోజూ ఆహారాన్ని అందిస్తున్నారు.
పేదలకు సచ్చిదానంద స్వామి నిత్యావసరాల పంపిణీ
ఇవీచూడండి:పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది