వైద్య శాస్త్రంలో సుప్రసిద్ధులుగా పేరు గడించిన పాథాలజీ పితామహుడు రుడాల్ఫ్ విర్చో జన్మదినం పురస్కరించుకుని... 2014 నుంచి ప్రతీ ఏటా అక్టోబర్ 13వ తేదీన... అంతర్జాతీయ థ్రోంబోసిస్ డే(రక్తం గడ్డకట్టడం) నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ థ్రోంబోసిస్, హెమటోస్టాటిస్ సంస్థలు వీటిని నిర్వహిస్తున్నాయి.
ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించి... వ్యాధి బారిన పడకుండా, వచ్చినా ఎలా ఎదిరించాలో తెలుపుతూ..ప్రజల్లో అవగాహన పెంచుతారు. దేశీయంగా డాక్టర్ కుమార్ కొత్తపల్లి, ఆయన టీమ్‌తో కలిసి గమన్ స్వచ్ఛంద సంస్థ అవగాహన సదస్సులు ఏర్పాట్లు చేస్తోంది.