రక్షణ దళాల్లో విశిష్ట సేవలందించిన వారికి ప్రకటించిన సేవా అవార్డుల ప్రదాన కార్యక్రమం తూర్పునౌకాదళంలో నిర్వహించారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ గాలంటరీ, నాన్ గాలంటరీ అవార్డులను వివిధ నౌకాదళ యూనిట్లలో పని చేసే వారికి అందజేశారు.
ఏపీ విశాఖలోని సముద్రిక అడిటోరియంలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సీనియర్ నేవీ అధికారులు, వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు. నేవల్ ఇన్వెస్టిట్యూర్ ఉత్సవం ఘనంగా జరిగింది. కమాండర్ ప్రకాశ్ వివేక్కి యుద్ద సేవా పతకం అందించారు. రియర్ అడ్మిరల్ జ్యోతిన్ రైనా, నివాస్‌లకు నవ్ సేనా పతకాలు(గాలంటరీ) లభించాయి. కమాండర్లు పీసీ మరఘాత వేలన్, ఆర్.విజయ్ శేఖర్‌లకు నవసేనా మెడల్ (డివోషన్ టు డ్యూటీ), కెప్టెన్లు రవికుమార్, రామ్ దులార్, శ్రీకాంత్ పరశ్ రాం మనేలకు విశిష్ట సేవాపతకాలు ప్రదానం చేశారు.