సీబీఐ కోర్టుకు హాజరైన గాలి... విచారణ 11కు వాయిదా... - కోర్టుకు హాజరైన గాలి జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్ సీబీఐ న్యాయస్థానంలో ఓఎంసీ కేసు విచారణ జరిగింది. కేసులో కీలక నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది ధర్మాసనం.

కోర్టుకు హాజరైన గాలి జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్ సీబీఐ న్యాయస్థానంలో ఓఎంసీ కేసు విచారణ ఇవాళ జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. కోర్టులో ఓఎంసీ కేసుపై న్యాయవాదులు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఈనెల 11కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై సీబీఐ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి సహా నిందితులుగా ఉన్న రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కూడా జైలుకు వెళ్లి వచ్చారు.
కోర్టుకు హాజరైన గాలి జనార్దన్‌రెడ్డి
Last Updated : Sep 6, 2019, 12:40 PM IST