గడ్డి అన్నారం డివిజన్‌లో ఉన్న సమస్యల శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని గడ్డి అన్నారం డివిజన్ భాజపా అభ్యర్థి ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. భాజపాను ప్రజలు ఆదరిస్తే ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ మేరకు... భారీ వర్షాలతో ముంపునకు గురైన వరద బాధితులందరికీ రూ.25 వేలు చెల్లిస్తామన్నారు. తెరాస పాలకులు అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. భాజపా గెలిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేస్తామన్నారు.
'భాజపాను గెలిపిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం' - భాజపా అభ్యర్థుల ప్రచారం వార్తలుట
భాజపాను ప్రజలు ఆదరించి... ఎన్నికల్లో గెలిపిస్తే.. ఆ ప్రాంతంలోని సమస్యలన్నింటిని శాశ్వతంగా పరిష్కరిస్తామని గడ్డి అన్నారం డివిజన్ భాజపా అభ్యర్థి ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. భాజపాను గెలిపిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని తెలిపారు.
'భాజపాను గెలిపిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం'