తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కూలీలకు నిత్యావసర సరకుల పంపిణీ - వలస కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కార్పొరేటర్​

ఈటీవీ భారత్, ఈటీవీ తెలంగాణ విజ్ఞప్తిపై గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ సాయిబాబా... ఛత్తీస్​ఘడ్​ రాష్ట్రానికి చెందిన వలస కూలీలకు నిత్యావసర సరకులు అందించారు. సుమారు రెండొందల మందికి బియ్యం, గోధుమ పిండి, నూనె పంపిణీ చేశారు.

Gachibouli corporator who supplies essential commodities
వలస కూలీలకు నిత్యావసర సరకుల పంపిణీ

By

Published : Mar 31, 2020, 1:42 PM IST

కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ వలస కార్మికులను ఆదుకోడానికి కొందరు తమ వంతు బాధ్యతగా ముందుకొస్తున్నారు. నిత్యావసర సరకులు అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఛత్తీస్​ఘడ్​ రాష్ట్రానికి చెందిన వలస కూలీలతో, పాటు భవన నిర్మాణ కార్మికులకు గచ్చిబౌలి డివిజన్​ కార్పొరేటర్​ సాయిబాబా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

వలస కూలీలకు నిత్యావసర సరకుల పంపిణీ

సుమారు రెండొందల మందికి ఒక్కొక్కరికీ ఐదు కేజీల బియ్యం, రెండు కేజీల గోధమ పిండి, నూనె ప్యాకెట్​ ఇచ్చారు. ఆదపకాల సమయంలో తమ వంతు బాధ్యతగా అభాగ్యులకు అండగా ఉండాలని కొర్పొరేటర్​ సాయిబాబా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ పిలుపుపై పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి:కలిసి కట్టుగా ఒకే జట్టుగా కరోనాపై జీ-20 పోరు

ABOUT THE AUTHOR

...view details