తెలంగాణలో వారసత్వ కట్టడాల(HERITAGE SITES) సంరక్షణ, నిర్వహణకు మూడు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర, జిల్లా, జీహెచ్ఎంసీ పరిధిల్లో వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో సీఎస్, జిల్లాల్లో కలెక్టర్లు వారసత్వ కమిటీలకు నేతృత్వం వహించనున్నారు. జీహెచ్ఎంసీ(GHMC), హెచ్ఎండీఏ(HMDA) పరిధిలో బల్దియా కమిషనర్ నేతృత్వం వహిస్తారని పేర్కొంది. దీంతో పాటు ప్రతి కమిటీకి ఇద్దరిని కోఆప్షన్ సభ్యులుగా నామినేట్ చేస్తామని ప్రకటించింది.
రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా.. టూరిజం, ఫైనాన్స్, విద్యా శాఖల కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. హెరిటేజ్ శాఖ డైరెక్టర్ ఈ కమిటీకి సభ్యుడిగా ఉంటూ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. జిల్లా స్థాయి కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. జిల్లా ఎస్పీ, జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా అటవీ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా టూరిజం అధికారి, జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారులు సభ్యులుగా ఉంటారు.