తెలంగాణ

telangana

ETV Bharat / state

మీ పిల్లలు పాఠశాలకు సురక్షితంగా చేరుకుంటున్నారా? - iot

ఆన్​లైన్​లో ఫుడ్​ ఆర్డర్​ చేసి డెలివరీ బాయ్​ లొకేషన్​ను ట్రాకింగ్​ చేయడం మనకు తెలిసిన విషయమే. అదే ట్రాకింగ్​ ద్వారా మీ పాప పాఠశాలకు సురక్షితంగా చేరుకుందో లేదో తెలుసుకోగలిగే అవకాశాన్ని కలిగిస్తోంది ఐఓటీ టెక్నాలజీ...

మీ పిల్లలు పాఠశాలకు సురక్షితంగా చేరుకుంటున్నారా?

By

Published : Nov 9, 2019, 4:58 AM IST

Updated : Nov 9, 2019, 8:06 AM IST

మీ పిల్లలు పాఠశాలకు సురక్షితంగా చేరుకుంటున్నారా?

ఐఓటీ టెక్నాలజీకి సంబంధించి హ్యాకింగ్ భయమున్నా... సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆ భయం తగ్గిపోతుందని పుణెకు చెందిన వైఫై సాఫ్ట్​ సంస్థ సీఈఓ రిషికేష్ అన్నారు. ఆ సంస్థతో పాటు లాయల్ టెలిసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 'ఫ్యూచర్ ఆఫ్ వైఫై ఇన్ ఇండియా' పేరిట సెమినార్ నిర్వహించారు.

అందరికీ అందుబాటులో...

ఇప్పటి వరకు ఐఓటీ పరికరాలు ధనవంతులకు మాత్రమే అనే అభిప్రాయం ఉందని, తాము అందించే పరికరాలు సామాన్యులకు కూడా అందుబాటు ధరలో ఉంటాయని లాయల్ టెలిసిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ఎన్ మూర్తి తెలిపారు. వైఫై ద్వారా నియంత్రించే ఐఓటీ పరికరాలు అందుబాటు ధరలో ఉండేవిధంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

మీ పిల్లలు సురక్షితమేనా...

ఉద్యోగం చేస్తున్న మహిళలు తమ పిల్లలు సురక్షితంగా పాఠశాలకు చేరుకున్నారో లేదోనని ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మూర్తి పేర్కొన్నారు. ఐఓటీ టెక్నాలజీ సాయంతో పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకునే సౌలభ్యం ఉందని వెల్లడించారు.

Last Updated : Nov 9, 2019, 8:06 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details