Future Innovators Fair at IIT HYD: ఇన్వెంటింగ్.. ఇన్నోవేటింగ్.. ఇన్‌టెక్నాలజీ ఫర్ హ్యూమానిటీ అనే మూడు సూత్రాలతో ఐఐటీ హైదరాబాద్ ఆవిష్కరణలకు చిరునామాగా నిలుస్తోంది. పాఠశాల దశ నుంచే విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించేలా.. 'ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఫేయిర్' చేపట్టింది. రాష్ట్రం నలుమూలల నుంచి 130కి పైగా ఆలోచనలు వచ్చాయి. వాటిల నుంచి అత్యుత్తమమైనవి 22 ఎంపిక చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో జాతీయ స్థాయికి ప్రదర్శనను విస్తరిస్తామని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి స్పష్టం చేశారు.
సౌర విద్యుత్‌తో సులువుగా పాత్రలను శుభ్రం చేసే పరికరం: పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహకులు పెద్ద పెద్ద పాత్రలను కడగడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇస్సాయిపేట జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సాకేత్ దృష్టిలో పడ్డాయి. అ సమస్యకు పరిష్కారంగా సోలార్ కమ్ హ్యాండ్ డిష్ వాషర్ ఆలోచన పుట్టుకొచ్చింది. సౌర విద్యుత్‌తో సులువుగా పాత్రలను శుభ్రపరిచే పరికరాన్ని రూపొందించాడు. బోడుప్పల్‌లోని పల్లవి మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు పర్యావరణ హిత శానిటరీ న్యాపికిన్స్ రూపొందించారు.
అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడే వ్యవస్థ: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కి చెందిన విద్యార్థి సూరజ్.. మిత్రులతో కలిసి అగ్నిప్రమాదాల సమయంలో ప్రాణాలు కాపాడే వ్యవస్థను రూపొందించాడు. ఆ పరికరం సెన్సార్ల ఆధారంగా మంటలను ఆర్పుతుంది. కల్వర్టుల వద్ద రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ సహకారంతో మహ్మద్ అనే విద్యార్థి పరిష్కారం చూపాడు.