తెలంగాణ

telangana

ETV Bharat / state

అమానవీయం.. కరోనా భయంతో ఖననాన్ని అడ్డుకున్నారు! - చిత్తూరు జిల్లాలో ఖననం అడ్డగింత

కరోనా భయం మానవత్వాన్ని మంటగలుపుతోందనడానికి ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన ఉదాహరణగా మారింది. కరోనాతో చనిపోయి ఉంటాడనే అనుమానంతో ఖననాన్ని అడ్డుకున్నారు ఐదు గ్రామాల ప్రజలు. కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ తెలితేనే గ్రామంలో ఖననం చేయాలని తేల్చిచెప్పారు.

funeral was interrupted by people from five villages with corona fear in chittor district
చిత్తూరు జిల్లాలో అమానవీయం..ఖననాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

By

Published : Jul 12, 2020, 6:00 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం వలసపల్లెలో అమానవీయ ఘటన జరిగింది. కరోనాతో మరణించాడన్న అనుమానంతో మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్నారు ఐదు గ్రామాల ప్రజలు.

మదనపల్లెలోని ఈశ్వరమ్మ కాలనీ వాసి(43) ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. వారం రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అతను ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో... వైద్యులు తిరుపతికి రిఫర్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని మండలంలోని వలసపల్లెలో ఖననం చేసేందుకు మృతుని బంధువులు ప్రయత్నించారు. అయితే అతను కరోనాతో చనిపోయి ఉంటాడనే అనుమానంతో ఖననం చేయడాన్ని పరిసర గ్రామస్థులు అడ్డుకున్నారు.

కొవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ తేలితేనే ఇక్కడ ఖననం చేయాలని తేల్చిచెప్పారు. చేసేదేమీ లేక పోలీసులు, వైద్య సిబ్బందికి సమాచారమిచ్చారు మృతుని బంధువులు. పోలీసులు వచ్చినా వైద్య సిబ్బంది రాలేదు. మృతదేహంతో ఉదయం నుంచి బంధువులు వేచి చూస్తున్నారు.

ఇవీచూడండి:మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం

ABOUT THE AUTHOR

...view details