తెలంగాణ

telangana

ETV Bharat / state

పూర్తైన చిన్నారి ప్రణతి అంత్యక్రియలు - SAIDABAD

రాచకొండ పోలీసు వాహనం ఢీకొని మరణించిన చిన్నారి ప్రణతి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల రోదనల మధ్య సైదాబాద్​లోని శ్మశానవాటికలో ఖననం చేశారు.

సైదాబాద్‌లోని శ్మశానవాటికలో ప్రణతి అంత్యక్రియలు

By

Published : May 12, 2019, 8:17 PM IST

పోలీసు వాహనం ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన ప్రణతి అంత్యక్రియలు ముగిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు రోజుల క్రితం రాచకొండ పోలీసు వాహనం ఢీకొని చికిత్స పొందుతూ మరణించింది. తెల్లవారుజామున చిన్నారి మృతి చెందినట్లు కామినేని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని చైతన్యపురి మున్సిపల్ కాలనీలోని ఆమె నివాసానికి తీసుకువచ్చారు. పార్థివదేహాన్ని చూసిన తండ్రి మల్లేష్, అక్క ప్రీతి ఇతర కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అనంతరం సైదాబాద్‌లోని శ్మశానవాటికలో ప్రణతి అంత్యక్రియలు నిర్వహించారు.

కుటుంబ సభ్యుల రోదనల మధ్య చిన్నారి ప్రణతి అంత్యక్రియలు
ఇవీ చూడండి : లారీ, ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details