మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం హైదరాబాద్లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. కరోనా బారిన పడిన ఎమ్మెస్సార్ ఈ తెల్లవారుజామున నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను ఆదేశించారు.
అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుణ్ని కోల్పోయాం: ఈటల - Mahaprasthanam Crematorium
మాజీ మంత్రి ఎం.సత్యనారాయణరావు మృతి తీరని లోటని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ ఓ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుణ్ని కోల్పోయిందని వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం ఎంఎస్ఆర్ అంత్యక్రియలు హైదరాబాద్లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.
Mahaprasthanam Crematorium
మహాప్రస్థానంలో మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో అధికారిక లాంఛనాలతో సత్యనారాయణరావు అంత్యక్రియలు జరగనున్నాయి. నిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెస్సార్ పార్థివదేహం వద్ద వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. తెలంగాణ ఓ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుణ్ని కోల్పోయిందన్న ఈటల... ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి:ఇక డిజిటల్ ఉపాధి శకం- నైపుణ్యాలకు గిరాకీ