ప్రభుత్వ లాంఛనాలతో ముఖేశ్‌గౌడ్ అంత్యక్రియలు మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ అంత్యక్రియలు నేడు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎస్కే జోషిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి ఎంజే మార్కెట్ ప్రాంతం జామ్‌బాగ్‌లోని పాత ఇంటిలో పార్థివ దేహాన్ని ఉంచుతారు.
పటిష్ఠ భద్రత
పదిన్నర గంటల నుంచి 11 గంటల వరకు ప్రజల సందర్శనకు ఉంచనున్నారు. అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమై జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ దగ్గరలోని దర్గా శ్మశానవాటిక వద్దకు చేరుకుంటుంది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది. అంతిమ యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది.
ఇవీ చూడండి : 'తండాలకు నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలం'