తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రం కరుణిస్తేనే రూ.5,386 కోట్లు - telangana latest news

కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులన్నీ.. పూర్తిస్థాయిలో రాష్ట్రానికి అందడం అనుమానంగానే కనిపిస్తోంది. పన్నుల్లో వాటా, స్థానిక సంస్థలు, విపత్తు నిర్వహణా నిధులు మినహా.. మిగతా సిఫార్సులను పరిశీలిస్తున్నట్లు కేంద్రం పేర్కొనడమే ఇందుకు కారణం. మిషన్ భగీరథ నిర్వహణకు.. సిఫార్సు చేసిన రూ.2,350 కోట్లు సహా రూ.5,386 కోట్లను రాష్ట్రానికి ఇచ్చే విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

FUNDS TO TELANGANA
కేంద్రం కరుణిస్తేనే రూ.5,386 కోట్లు

By

Published : Feb 5, 2021, 5:37 AM IST

కేంద్రం కరుణిస్తేనే రూ.5,386 కోట్లు

రానున్న ఐదేళ్లకు రాష్ట్రాలకు నిధుల పంపిణీ విషయమై.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. అయితే కమిషన్ సిఫార్సులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. పన్నుల వాటా, స్థానిక సంస్థలకు గ్రాంట్లు, విపత్తు నిర్వహణా నిధుల కోసం చేసిన సిఫార్సులను మాత్రమే కేంద్రం ఆమోదించింది.

కేంద్ర నిర్ణయం తీసుకున్నది (ఐదేళ్లకు అందించే నిధులు)

  • పన్నుల్లో వాటా, గ్రాంట్లు - 88,806 కోట్లు
  • స్థానిక సంస్థలకు గ్రాంట్లు - 13,111 కోట్లు
  • రాష్ట్ర విపత్తు నిర్వహణకు - రూ.2,483

కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సింది

  • వ్యవసాయ సంస్కరణల అమలు - రూ.1,665 కోట్లు
  • ఆరోగ్యం, వైద్య వసతులు - రూ. 624 కోట్లు
  • పీఎంజీఎస్​వై రోడ్ల నిర్వహణకు - రూ. 255 కోట్లు
  • న్యాయవ్యవస్థకు - రూ.245 కోట్లు
  • ఉన్నతవిద్యకు - రూ.189 కోట్లు
  • గణాంకాల నిర్వహణ - రూ.45 కోట్ల
  • మిషన్​ భగీరథ - రూ.2350 కోట్లు
  • అడ్మినిస్ట్రేటివ్​ కాలేజీకి తోడ్పాటు - రూ.12 కోట్లు

మొత్తంగా 5 వేల 386 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వాలని కమిషన్ ప్రతిపాదించింది. అయితే ఈ నిధుల విషయమై కమిషన్ సిఫార్సులను.. కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. 2020-21 బడ్జెట్ సమయంలో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతున్నందున రూ.723 కోట్లను ప్రత్యేకంగా ఇవ్వాలని.. 15వ ఆర్థిక సంఘం తన తాత్కాలిక నివేదికలో సిఫార్సు చేసింది. ఆ సిఫార్సును పరిశీలిస్తున్నామని కేంద్రం గత బడ్జెట్ సమయంలో చెప్పింది. కమిషన్ సిఫార్సులను అనుగుణంగా రూ. 723 కోట్లు ఇవ్వాలని.. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా ఫలితం లేకపోయింది. తాజాగా ఆర్థిక సంఘం సిఫార్సులను అన్నింటినీ ఆమోదించకుండా.. పరిశీలిస్తున్నామన్న కేంద్రం వ్యాఖ్యల నేపథ్యంలో 5 వేల 386 కోట్ల రూపాయలు వస్తాయా..లేదా.. అనే సంశయం నెలకొంది.

ఇవీచూడండి:విన్నపాలు బుట్టదాఖలు.. రాష్ట్రాన్ని నిరుత్సాహపరిచిన కేంద్ర బడ్జెట్​

ABOUT THE AUTHOR

...view details