Palle Pragathi Funds : రాష్ట్రంలో పల్లెప్రగతి అమలులో భాగంగా.. ఫిబ్రవరి నెలకు గ్రాంట్‌గా ప్రభుత్వం రూ.227కోట్ల 50లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ది కోసం కేటాయించిన 227.50కోట్ల నిధుల్లో రూ.210కోట్ల 44లక్షలు గ్రామ పంచాయితీలకు, రూ.11కోట్ల 37లక్షలు మండల పరిషత్తులు, రూ.5కోట్ల 69లక్షలు జిల్లా పరిషత్తులకు ప్రతినెల గ్రాంటుగా విడుదల చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వెల్లడించారు.
గ్రాంట్ల వివరాలు..
పల్లె ప్రగతి కింద 2019 సెప్టెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు రూ.8 వేల 569 కోట్ల 50 లక్షలు గ్రాంటుగా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేశామని వివరించారు. కేంద్రం నుంచి 2021-2022 మొదటి విడతగా రూ.682 కోట్ల 50 లక్షలు విడుదలయ్యాయని మంత్రి వెల్లడించారు. కేంద్రం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో విడత నిధులు రాకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసిందన్నారు.