తెలంగాణ

telangana

ETV Bharat / state

Double Bedroom Houses: 'నిధుల్లేవ్.. ఇంకా రూ.11 వేల కోట్లు కావాలి'

‘హడ్కో’ నుంచి రూ.8,744 కోట్ల అప్పుతెచ్చి... రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిన గృహనిర్మాణ శాఖకు నిధుల సమస్య ఎదురైంది. పనుల పురోగతిని బట్టి గుత్తేదారులకు చెల్లింపులు జరగాల్సి ఉండగా... మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంకా రూ.11 వేల కోట్లు కావాలని గృహనిర్మాణ శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Double Bedroom Houses
రెండు పడక గదుల ఇళ్లు

By

Published : Aug 28, 2021, 8:00 AM IST

రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నిధుల సమస్య ఎదురవుతోంది. గృహ నిర్మాణశాఖ గడిచిన ఆరేళ్లలో హౌసింగ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) నుంచి రూ.8,744 కోట్ల అప్పులు తెచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పనుల పురోగతిని బట్టి గుత్తేదారులకు చెల్లింపులు జరపాల్సి ఉండగా, ఆలస్యం అవుతుండటంతో కొన్నిచోట్ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పలుచోట్ల పనులే మొదలుకాలేదు. ముఖ్యంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2.91 లక్షల ఇళ్లు మంజూరు కాగా 21.8 శాతం ఇళ్ల (63,678) పనులు ఇప్పటికీ మొదలుకాలేదు. పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు సహా మొత్తంగా రూ.11 వేల కోట్లు కావాలని గృహ నిర్మాణశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసినట్లు సమాచారం.

బడ్జెట్‌ కేటాయింపుల కోసం...

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణ ఖర్చు రూ.19,074.60 కోట్లు కాగా..జులై 31 నాటికి రూ.10,427.85 కోట్లు ఖర్చుచేశారు. 2021-22 బడ్జెట్‌లో రెండు పడకగదుల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.11 వేల కోట్ల నిధులు కేటాయించింది. ఇవి మంజూరై నిర్మాణంలో ఉన్న గృహాల్ని పూర్తిచేయడానికి..అదేవిధంగా సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునేవారికి ఇచ్చే ఆర్థిక సహకారానికి కలిపి కేటాయించినవిగా గృహనిర్మాణశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌-జూన్‌, జులై-సెప్టెంబరు రెండు త్రైమాసికాలకు కలిపి రూ.3 వేల కోట్లు ఇవ్వాలని కోరామని.. మిగిలిన రూ.8 వేల కోట్ల నిధులు ఆర్థికసంవత్సరం పూర్తయ్యే నాటికి అవసరం అవుతాయని అధికారులు చెబుతున్నారు.

మిగిలిన ఇళ్లు మొదలయ్యేదెప్పుడో..

పలు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పురోగతి చాలా తక్కువగా ఉంది. మంజూరైన మొత్తం ఇళ్లలో దాదాపు సగం వాటి పనులు ఇప్పటికీ మొదలుకాలేదు. దీంతో అవి మొదలయ్యేనా? అయితే ఎప్పుడు? అని సందేహం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి:ఆత్మాహుతి దాడుల్లో మృతులు 180 మంది పైనే!

ABOUT THE AUTHOR

...view details