తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల భాగస్వామ్యంతో రామ మందిరం - ఓయూ ఇన్​ఛార్జ్​

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం.. తార్నాకలోని మాణికేశ్వర నగర్​లో నిధి సేకరణ చేపట్టారు. భక్తులు వీధుల్లో తిరుగుతూ స్థానికుల నుంచి విరాళాలను స్వీకరించారు.

Fund raising For Rama Mandir in Manikeshwara Nagar Tarnaka hyderabad
'ప్రజల భాగస్వామ్యంతో రామ మందిరం'

By

Published : Jan 31, 2021, 9:25 AM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి.. హైదరాబాద్ తార్నాకలోని మాణికేశ్వర నగర్​లో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రామజన్మ భూమి ట్రస్ట్ ఓయూ ఇన్​ఛార్జ్​ డా. అనంత శంకర్, భాజపా నాయకురాలు అమృత ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యం ఉంటే ఏ పనైనా విజయవంతమవుతుందని డా. అనంత శంకర్ పేర్కొన్నారు. విరాళాలు ఇవ్వడానికి భక్తులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:అయోధ్య రామమందిరానికి హైదరాబాదీ ముస్లిం భారీ విరాళం

ABOUT THE AUTHOR

...view details