చైనా యాప్‌ల తరహాలో ఆ దేశ ఉత్పత్తులను భారత్‌లో నిషేధిస్తే... దేశంలోని పరిశ్రమలకు అది కోలుకోలేని దెబ్బ అవుతుందని తెలంగాణ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు కరుణేంద్ర జాస్తీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ పరిశ్రమలను సమాయత్తం చేయకుండా... అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంటే వేల సంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడతాయన్నారు. లక్షల మంది రోడ్డున పడతారని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటికీ అంతర్జాతీయంగా పోటీ ఇచ్చే పరిశ్రమలు లేవని... కేవలం సెంటిమెంట్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభావం దారుణంగా ఉంటుందంటున్న కరుణేంద్ర జాస్తీ తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'సెంటిమెంట్లతో నిర్ణయాలు తీసుకోకూడదు... చాలా ఆలోచించాలి' - కరుణేంద్ర వార్తలు
సెంటిమెంట్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదని... దాని వల్ల పరిస్థితులు దారుణంగా ఉంటాయని రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు కరణేంద్ర పేర్కొన్నారు. చైనా ఉత్పత్తులు దేశంలో నిషేధిస్తే మధ్య తరహా, చిన్న పరిశ్రమలు మూతపడతాయన్నారు.
'సెంటిమెంట్లతో నిర్ణయాలు తీసుకోకూడదు... చాలా ఆలోచించాలి'