కరోనా వైరస్ మూడో దశకు వ్యాప్తి చెందితే ప్రమాదమన్న ఉద్దేశంతో... తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో కరోనా రోగుల చికిత్సలకే వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిని కరోనా చికిత్స కేంద్రంగా అభివృద్ధి చేయగా, ఛాతీ ఆసుపత్రిలో పాక్షికంగా సేవలందిస్తున్నారు. వీలైనంత త్వరగా గాంధీ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.
‘గాంధీ’... పూర్తిగా కరోనా చికిత్సలకే!
కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండడంతో తెలంగాణ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వ్యాప్తి కట్టడిపై బీఆర్‌కే భవన్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు.
‘గాంధీ’... పూర్తిగా కరోనా చికిత్సలకే!
ఇవీ నిర్ణయాలు
- ప్రస్తుతం గాంధీ బోధనాసుపత్రిలో 36 విభాగాలున్నాయి. ఇందులో 9 నాన్ క్లినికల్ విభాగాలు మినహా, మిగిలిన 27 విభాగాల్లో అయిదింటిని మాత్రమే గాంధీలో వినియోగించుకోనున్నారు.
- మొత్తం 1500 పడకలు అందుబాటులోకి వస్తాయి. వీటిలో 200 ఐసీయూ పడకలు.
- కరోనా రోగుల చికిత్సకు అవసరమయ్యే జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, నెఫ్రాలజీ, పల్మనాలజీ, కార్డియాలజీ విభాగాలను ఇక్కడే కొనసాగిస్తారు.
- గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్ధోపెడిక్స్, ఆఫ్తల్మాలజీ, ఈఎన్‌టీ, న్యూరాలజీ, తదితర విభాగాలన్నింటినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారు.
- ఇకపై సాధారణ ఓపీతో పాటు అత్యవసర చికిత్స అవసరమైన వారు కూడా ఉస్మానియాకే వెళ్లాల్సి ఉంటుంది.
- ఇదీ చూడండి :కరోనా మూడో దశకు చేరుకుంటే.. ఏం చేద్దాం: ఈటల