రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ అందరి దగ్గరికి వెళ్లి ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ఇందులో ఆశ్యర్యమేముందంటారా... అక్కడే ఉంది. ఈ విందుకు హాజరైన ఎంపీ రేవంత్ రెడ్డిని గవర్నర్ కలిసినప్పుడు వారి మధ్య సరదా సంభాషణ జరిగింది.
గవర్నర్: రేవంత్ వచ్చారా... మీరు రారేమో అనుకున్నా...
రేవంత్: మీరు పిలిచాక రాకుండా ఉంటామా...
గవర్నర్: గతంలోనూ... వస్తానని రాలేదు కదా...
రేవంత్: మీరు కొడతారేమోనని రాలేదు...సార్...
గవర్నర్: కొట్టింది నేనా... మీరా...