తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం మత్తులో ఘర్షణ... స్థానికుల ఆందోళన - wine effect

మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సికింద్రాబాద్​ అడ్డగుట్టలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించగా... ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆరోపించారు.

Friction between two persons became big in addagutta
మద్యం మత్తులో ఘర్షణ... స్థానికుల ఆందోళన

By

Published : May 10, 2020, 12:33 PM IST

సికింద్రాబాద్ అడ్డగుట్టలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళుతున్న మరో వ్యక్తిని కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ప్రతిఘటించే క్రమంలో ఇద్దరూ పరస్పర దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ పెరిగి... రక్తాలు చిందేవరకు వచ్చింది.

ఆందోళనకు గురైన స్థానికులు... తుకారాంగేట్ పోలీస్ స్టేషన్​కు ఫోన్ చేసినా... చాలా సేపటి వరకు ఎవరూ రాలేదు. మళ్లీ డయల్​ 100కు కాల్​ చేసినా లాభం లేకుండా పోయింది. ఇక లాభం లేదని తలచిన స్థానికులే అడ్డుపడి... దాడి చేసిన వ్యక్తిని పోలీస్​స్టేషన్​కు తరలించారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితున్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details