హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల రేపటి నుంచి రెండు రోజుల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1 కోదండపూర్, నాసర్లపల్లి, గొడకండ్ల గ్రామాల వద్ద గల పంప్‌హౌస్‌లలో 600 ఎమ్ఎమ్ డయా పైపులైన్ పై వాల్వులు అమర్చడం, 300 ఎమ్ డయా పైపులైన్ లీకేజీని అరికట్టడం కోసం పనులు జరుగుతున్నట్లు జలమండలి తెలిపింది.
కేడీడబ్యూఎస్పీ ఫేజ్-1 కోదండపూర్ నుంచి గొడకండ్ల వరకు గల పైపులైన్‌కు పలు ప్రాంతాల్లో మరమ్మతులు వంటి తదితర పనులను చేపడుతుండడం వల్ల మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 36 గంటలు పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.