హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉదయం వారి వారి గమ్య స్థానాలకు వెళ్లే ఉద్యోగులు, వాహన దారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం నమోదైంది.
నగరంలో ఎడతెరిపి లేని వానలు - Freezing rain in the city
ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచి.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
![నగరంలో ఎడతెరిపి లేని వానలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4017256-636-4017256-1564728307126.jpg)
నగరంలో ఎడతెరిపి లేని వర్షాలు