దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తీసుకోచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 574 స్టేషన్లో ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉందని వెల్లడించారు. వైఫై సౌకర్యం కల్పించిన జోన్లో దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. రోజూ సగటున 50 వేల మంది ప్రయాణికులు వైఫై సేవలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. రోజూ 5 వేల జీబీ నుంచి 28 వేల జీబీ డేటాను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్నిస్టేషన్లలో ఉచిత వైఫై - దక్షిణ మధ్య రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై
అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తీసుకోచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నామని సీపీఆర్వో రాకేశ్ తెలిపారు.
అన్నిస్టేషన్లలో ఉచిత వైఫై