తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పథకం రేపు ప్రారంభం! - తెలంగాణ వార్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉచిత తాగునీటి పథకం మంగళవారం ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.

free-water-scheme-launch-on-january-12-by-minister-ktr-at-jubilee-hills-in-hyderabad
గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పథకం రేపు ప్రారంభం!

By

Published : Jan 11, 2021, 5:26 PM IST

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకం మంగళవారం ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహ్మత్ నగర్ డివిజన్ ఎస్సీఆర్ హిల్స్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.

బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకున్నా నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అపార్ట్‌మెంట్లలో మీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన పెట్టింది. 20వేల లీటర్లు దాటిన నీటి వినియోగంపై పాత ఛార్జీలతో బిల్లు వసూలు చేయనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి:జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details