హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్సకోసం వచ్చిన వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని నిర్ణయంచింది.
ఆసుపత్రికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో..ఏదైనా ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చూపించుకోడానికి వెళ్లి.. అక్కడి వైద్యులను సంప్రదించాక తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్ఛు ఆసుపత్రిలో వైద్యులు రాసిన మందుల చిట్టీపైనే సమయాన్ని సూచిస్తారు. ఆ చిట్టీని కండక్టర్‌కు చూపిస్తే ఉచితంగా ప్రయాణించడానికి వీలుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడివరకైనా ఇలా ఉచితంగా చేరుకోవచ్ఛు