హైదరాబాద్ బోరబండ డివిజన్‌లో స్థానిక తెరాస నేతలు ఉచిత తాగునీటి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. డివిజన్ తెరాస అధ్యక్షుడు కృష్ణమోహన్, డిప్యూటీ మేయర్ సతీమణి బోరబండ సైట్ వన్‌లోని పార్టీ కార్యాలయం వద్ద ఉచిత మంచినీటి ట్యాంకర్‌ను ప్రారంభించారు.
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచితంగా డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో మంచినీటిని అందిస్తున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. ప్రతిరోజు ఇంటింటికి మంచినీటిని సరఫరా చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
'బోరబండలో ఉచిత తాగు నీటి సరఫరా' - TRS DIVISION PRESIDENT
వేసవిలో స్థానిక ప్రజల దాహం తీర్చేందుకు డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. పేద ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం సంతోషకరమని డిప్యూటీ మేయర్ సతీమణి పేర్కొన్నారు.

బోరబండ పార్టీ కార్యాలయం వద్ద ఉచిత మంచినీటి ట్యాంకర్ ప్రారంభం
పేద ప్రజల కోసమే ఉచిత తాగునీరు : డిప్యూటీ మేయర్ సతీమణి
ఇవీ చూడండి : పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర