తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాగోల్ నక్షత్ర ఆసుపత్రిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్​'

హైదరాబాద్ నాగోల్​లో నక్షత్ర ఆసుపత్రి వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ధ్యేయంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

By

Published : Nov 9, 2019, 6:38 PM IST

పేద ప్రజలకు నాణ్యమైన వైద్య కోసమే మెగా హెల్త్ క్యాంప్ : ఆసుపత్రి యాజమాన్యం


డా.మాదిరెడ్డి మల్లారెడ్డి దేవరకొండ జ్ఞాపకార్థం నాగోల్ అల్కాపురి నక్షత్ర ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​ రెడ్డి, కార్పొరేటర్ రాధాతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలను.. అతి తక్కువ ధరకే అందించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరికీ బీపీ, షుగర్ , మోకాళ్ళ నొప్పులు, ఆలోచనతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని అన్నారు.

ఆరోగ్య సమస్యల తీవ్రత ఎక్కువయ్యే వరకు మనకు తెలియదని, కాబట్టి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని అన్నారు. అన్ని రకాల ప్రముఖ వైద్య నిపుణులతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. పేద ప్రజలకు న్యాయమైన వైద్యం అందించాలనే లక్ష్యంతోనే ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

పేద ప్రజలకు నాణ్యమైన వైద్య కోసమే మెగా హెల్త్ క్యాంప్ : ఆసుపత్రి యాజమాన్యం
ఇవీ చూడండి : ఛలో ట్యాంక్​బండ్ ఉద్రిక్తం... బాష్పవాయువు ప్రయోగం..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details