తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నపూర్ణ క్యాంటీన్​లలో 10 వేల మందికి ఉచిత భోజనం - Annapoorna Canteen Mayor bonthu Ram mohan

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని అన్నపూర్ణ క్యాంటీన్‌లలో గురువారం మధ్యాహ్నం 10 వేలమందికి ఉచిత భోజనం అందించినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. శుక్రవారం నుంచి వీటిని యధావిధిగా తెరవనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

మేయర్​ బొంతు రామ్మోహన్​
మేయర్​ బొంతు రామ్మోహన్​

By

Published : Mar 27, 2020, 7:07 AM IST

జీహెచ్​ఎంసీ పరిధిలోని 150 అన్నపూర్ణ కేంద్రాలను శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో తెరుస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. వసతిగృహాలలో ఉంటున్న వాళ్లు సైతం సమీపంలోని అన్నపూర్ణ కేంద్రాల్లో భోజనం చేశారని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ క్యాంటీన్‌లలో గురువారం మధ్యాహ్నం 10 వేలమందికి ఉచిత భోజనం అందించినట్లు చెప్పారు. సిబ్బంది కొరతతో 78 కేంద్రాలు నడిచాయని... రేపటి నుంచి అన్ని అన్నపూర్ణ క్యాంటీన్ కేంద్రాలు నడిపించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు.

ఇదీ చూడండి :రోడ్లపై ఇష్టారాజ్యంగా కంచెలు.. లైన్‌మెన్​ బలి

ABOUT THE AUTHOR

...view details