హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో ఓ పేద జంటకు ఉచితంగా వివాహం జరిపించారు. వధూవరులు జగదీశ్, ప్రసన్న జంటకు మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా వైభవంగా పెళ్లి చేశారు. దీనితో కలిపి ఇప్పటి వరకు 183 ఉచిత వివాహాలు జరిపించినట్టు ఉపేందర్ గుప్తా తెలిపారు. కొవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ మాస్కులు పెట్టుకుని భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమం జరిపించామని వారు వెల్లిడించారు. ఉపేందర్ పెద్ద మనస్సుకి నూతన వధూవరులు కృతజ్ఞతలు తెలిపారు.
మొగుళ్లపల్లి యువసేన దాతృత్వం: పేద జంటకు ఉచితంగా వైభవంగా పెళ్లి - దిల్సుఖ్నగర్లో పేద జంటకు ఉచిత వివాహం
నా అనేవారు లేని.. పెళ్లి ఖర్చులకు స్తోమతలేని నిరుపేద జంటలకు మొగుళ్లపల్లి యువసేన ఉచితంగా వివాహాలు జరిపిస్తున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఓ పేద జంటకు వైభవంగా పెళ్లి చేశారు.
మొగుళ్లపల్లి యువసేన దాతృత్వం.. పేద జంటకు వైభవంగా ఉచిత పెళ్లి