ఎంతోమంది నిరుపేదలకు అన్నీతానై అండగా నిలుస్తున్నారు హైదరాబాద్కు చెందిన మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా. మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో 180 పేద జంటలకు వివాహం జరిపించారు.
మొగుళ్లపల్లి యువసేన @181వ కల్యాణం - దిల్సుఖ్నగర్ సత్యనారాయణ ఆలయంలో వివాహం
నిరుపేదలకు అండగా నిలుస్తూ, వారికి చేతనైన సాయం చేస్తున్నారు హైదరాబాద్కు చెంది మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా. మొగుళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో ఇప్పటికే 180 పేద జంటలకు కల్యాణం జరిపించారు. తాజాగా దిల్సుఖ్నగర్లోని సత్యనారాయణ దేవస్థానంలో 181వ జంటకు ఘనంగా వివాహం చేశారు.
మొగుళ్లపల్లి యువసేన @181 కల్యాణం
దిల్సుఖ్నగర్లోని సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నేడు 181వ జంటకు వైభవంగా కల్యాణం జరిపించారు. మేళతాళాలు, మంగళ వాద్యాలు, పురోహితుల వేద మంత్రాల నడుమ వధూవరులు ఒక్కటయ్యారు.
పేదరికంలో ఉండి వివాహం చేసుకోవాలనుకునే వారికి అండగా నిలిచి, ఘనంగా వివాహం జరిపిస్తామని మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా తెలిపారు. కల్యాణం చేసుకోవాలనుకునే వారు 15 రోజుల ముందు తమను సంప్రదించాలని కోరారు. సమాజానికి తన వంతు సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉందన్నారు.
- ఇదీ చూడండి :కరోనా కలవరం: భారత్లో 169కి చేరిన కేసులు