వాహన దారులకు ట్రాఫిక్ అవగాహనలో భాగంగా సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వద్ద శ్రీరామ్ చిట్స్, నగర పోలీసులు సంయుక్తంగా వాహన చోదకులకు ఉచితంగా శిరస్త్రాణాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ హాజరై హెల్మెట్లను వాహనదారులకు అందచేశారు. శిరస్త్రాణం ధరించడం వల్ల ప్రాణాలకు రక్షణ ఉంటుందని.. రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో ద్విచక్రవాహన దారులే ఎక్కువగా ఉన్నారని.. వారంతా హెల్మెట్ ధరించక పోవడం వల్లే చనిపోతున్నారని అనిల్ తెలిపారు.
'రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడానికి హెల్మెట్ లేకపోవడమే కారణం' - హెల్మెట్
రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో ద్విచక్రవాహన దారులే ఎక్కువగా ఉన్నారని.. వారంతా హెల్మెట్ ధరించక పోవడం వల్లే చనిపోతున్నారని ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్లో శ్రీరామ్ చిట్స్, నగర పోలీసులు సంయుక్తంగా ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా శిరస్త్రాణం పంపిణీ చేశారు.
'రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడానికి హెల్మెట్ లేకపోవడమే కారణం'
ప్రజల్లో ట్రాఫిక్ నియమ, నిబంధనలపై చైతన్యం తీసుకురావడానికి ముందుకు వచ్చిన శ్రీరామ్ చిట్స్ సంస్థను అభినందించారు. మిగతా కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు రావాలని కోరారు.
ఇదీ చూడండి: ఈనెల 28న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్టీసీపై చర్చ!!