భాగ్యనగరం అమీర్‌పేట గురుద్వారా సమీపంలో నివసించే కుల్వంత్‌సింగ్(టిల్లూభాయ్) కుటుంబ సభ్యులు తమ కుమారుడు మన్‌మిత్‌సింగ్(సోనూ) జ్ఞాపకార్థం శనివారం భోజన ప్యాకెట్లను నగరంలోని పేదలకు పంపిణీ చేశారు. నిలోఫర్ ఆసుపత్రితోపాటు రహదారులపై అభాగ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, కూలీలకు వీటిని అందజేశారు.
కన్నీటి జ్ఞాపకం.. కడుపునిండా భోజనం - Hyderabad Ameerpet Free Food Packets
చేతికందివచ్చిన కుమారుడు ఇటీవల ఆకస్మికంగా కన్నుమూశాడు. విషాదం నుంచి ఇంకా తేరుకోని ఆ కుటుంబం పేదల ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చిన అరుదైన ఘటన హైదరాబాద్ అమీర్‌పేటలో జరిగింది.
హాస్టల్ విద్యార్థులు, పేదలకు..సొంతూళ్లకు వెళ్లే వీలులేక ప్రభుత్వ ఆదేశాల మేరకు హాస్టళ్లలోనే ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులకు నుంచి ఉచిత భోజనం అందిస్తున్నారు. అమీర్‌పేట డివిజన్‌లో హాస్టళ్లు ఎక్కువగా ఉన్న గురుమూర్తినగర్, బాపూనగర్, బల్కంపేటలో జీహెచ్‌ఎంసీ, అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన శిబిరాలను కార్పొరేటర్ శేషుకుమారి ప్రారంభించారు. ప్రతి రోజు భోజనం అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : కరోనాపై ఎలా గెలవాలో మోదీకి చెప్పిన హైదరాబాదీ