పేదవారికి, ఆకలితో అలమటిస్తున్న వారికి స్వయంగా ఆహారం తయారు చేసి పంపిణీ చేస్తున్నారు హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రేషన్ కార్డు లేని ఇతర రాష్ట్రాల వారికి ఈ ఆహార పథకాన్ని అందిస్తానని వెల్లడించారు. అలాంటి వారు ఎవరున్నా 9000214000కి ఫోను చేసి వివరాలు తెలియజేస్తే... సహాయం చేస్తామని రాజాసింగ్ తెలిపారు.
అనుమతిస్తే ఓకే.. లేదంటే నా స్టైల్లో వెళ్తా...
మధ్యాహ్న భోజనంతోపాటు రాత్రి వేళల్లోనూ పేద ప్రజలకు అన్నం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు కార్యకర్తలకు ప్రత్యేక పాసులు ఇవ్వాలని కోరగా పోలీసులు ఇవ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాసులు ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహార శైలి ఇలాగే ఉంటే తన సొంత పంథాలో వెళ్తానని రాజాసింగ్ వివరించారు. రేషన్ సరకులను త్వరగా పంపిణీ చేస్తే ప్రజలకు ఎంతో సహాయం చేసిన వారవుతారన్నారు.
ఆహారం కోసం మమ్మల్ని సంప్రదించండి : రాజాసింగ్ ఇవీ చూడండి : 'అదుపులోనే ఉంది.. అయినా మరో మూడువారాలు తప్పదు'