లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని నిరాశ్రయులు, నిరుపేదలకు జీహెచ్‌ఎంసీ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజం అందిస్తోంది. రూ.5 భోజనాన్ని ఉచితంగా అందజేయడంతోపాటు మరో వంద కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలని అధికారులను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం 150 అన్నపూర్ణ కేంద్రాలతో పాటు మరో 100 అందుబాటులోకి వచ్చాయి. నగరంలో గురువారం 59వేల మంది ఆకలి తీర్చినట్లు అధికారులు వెల్లడించారు.
సర్కిల్‌కు ఒక్కటి చొప్పున ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి వీధుల్లో తలదాచుకునే వారికి సంబంధిత ఏఎంహెచ్‌వో ఆధ్వర్యంలో అందజేస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో భోజనాలను అందిస్తున్నారు. రోజుకు కనీసం 45 వేల మందికి ఆహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ... 59,010 మంది ఆకలి చల్లార్చినట్లు అధికారులు తెలిపారు.