తెలంగాణ

telangana

ETV Bharat / state

సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్ - తెలంగాణలో సెలూన్లకు ఉచిత విద్యుత్​

రాష్ట్రంలోని సెలూన్లు, లాండ్రీలు, దోభీ ఘాట్లకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం లభించనుంది. నెలకు 250 యూనిట్ల వరకు కరెంటును ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తుల పరిశీలన తర్వాత సీఎం ఆమోదించారు. తక్షణమే జీవో జారీ చేయాలని సీఎంవో కార్యదర్శికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Free electricity to salons, free electricity supply to barber salons
సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్

By

Published : Apr 4, 2021, 11:27 PM IST

రాష్ట్రంలోని సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తుల పరిశీలన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తక్షణమే జీవో జారీచేయాలని సీఎంవో కార్యదర్శికి కేసీఆర్ ఆదేశించగా...వెంటనే విడుదల చేశారు. ఉచిత విద్యుత్‌ సరఫరా ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి కేసీఆర్​.. లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి :పత్తి రైతులపై రూ.కోట్ల భారం..పెరగనున్న విత్తన ధరలు

ABOUT THE AUTHOR

...view details