'మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం' అంటూ హైదరాబాద్ ఐఎస్ సదన్ కార్పొరేటర్ స్వప్న సుందర్ రెడ్డి.. ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కరోనా కట్టడి నేపథ్యంలో సామూహిక వేడుకలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని సుందర్‌రెడ్డి సూచించారు.
ఐఎస్ సదన్‌లో ఉచితంగా మట్టివినాయకుల పంపిణీ చేసిన కార్పొరేటర్ - free ecofriendly ganesh idols distribution at is sadan
హైదరాబాద్ ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ స్వప్న సుందర్ రెడ్డి.. ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఉత్సవాలను సాదాసీదాగా జరుపుకోవాలని కార్పొరేటర్ సూచించారు.
![ఐఎస్ సదన్‌లో ఉచితంగా మట్టివినాయకుల పంపిణీ చేసిన కార్పొరేటర్ is sadan corporatot distributed free ganesh idols](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8506303-803-8506303-1598012766642.jpg)
ఐఎస్ సదన్‌లో ఉచితంగా మట్టివినాయకుల పంపిణీ చేసిన కార్పొరేటర్
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘం ప్రతినిధుల ద్వారా సుమారు వేయి వరకు మట్టి గణపతులు అందజేశామన్నారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది పండుగలను వైభవంగా జరగడం లేదని.. వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందామని స్వప్న పేర్కొన్నారు.