Free Drinking Water Scheme: జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు ఉచిత మంచినీటి పథకం పొందే అవకాశాన్ని... ఈనెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటిని అందించే పథకాన్ని సర్కారు జనవరిలో ప్రారంభించింది. ఇందుకోసం వినియోగదారులు తమ నల్లా కనెక్షన్లకు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి. తమ క్యాన్ నెంబరుకు ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టు 15 వరకు జలమండలి అవకాశం ఇచ్చినా... కొంతమంది ఇంకా మీటరు అమర్చుకోలేదు. మరికొందరు క్యాన్ నెంబరుకు ఆధార్ లింక్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని పొందేందుకు గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
ఉచిత మంచినీటి పథకం పొందే అవకాశం ఎప్పటివరకంటే..? - ఉచిత తాగునీటి పథకం
Free Drinking Water Scheme: గ్రేటర్ పరిధిలోని ఉచిత తాగునీటి పథకం గడువును ప్రభుత్వం ఈ నెల 31 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని అందించే పథకాన్ని గత డిసెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. బస్తీల్లో నివసించే వారు మీటర్లు అమర్చుకోవాల్సిన అవసరం లేదు.
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి గృహ వినియోగదారులు అందరికీ బిల్లులు జారీ చేస్తామని జలమండలి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జలమండలి కోరింది. మీటరు అమర్చుకోని, ఆధార్ లింక్ చేసుకోనివారికి... 2020 డిసెంబరు నుంచి.. ఈ డిసెంబరు 31 వరకు బిల్లులు జారీ చేస్తారు. ఎటువంటి పెనాల్టీలు, వడ్డీ లేకుండా నాలుగు వాయిదాల్లో బిల్లు చెల్లించే వెసులుబాటు కల్పించారు. సందేహాలు ఉంటే జలమండలి నం.155313కి ఫోన్ చేయాలని సూచించింది.
ఇదీ చూడండి:hyderabad water supply: ఆ ప్రాంతాల్లో ఈ తేదీన నీటిసరఫరా నిలిపివేత..