సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు జంటనగరాల్లోని నిరుపేదలకూ అధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వారి బాగోగులకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఆయన సీతాఫల్మండీలో ప్రారంభించారు.
పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్! - ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్
పారిశుద్ధ్య సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. వారి బాగోగులకు తమ వంతు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు.
free cancer screening camp, theegulla padmarao
ఈ సందర్భంగా శానిటేషన్ సిబ్బంది సేవలను తీగుల్ల కొనియాడారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, యువ నేతలు కిశోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, మోతే శ్రీలత రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయంలో మరో 10 మంది ఉద్యోగులకు కరోనా