కరీంనగర్ జిల్లా వావిలాలపల్లికి చెందిన రిషిరెడ్డి అలియాస్ హరీష్ ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి హెచ్‌ఎంగా పనిచేశారు. కొంతకాలం క్రితం చనిపోయారు. తల్లి ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిని. రిషిరెడ్డి విలాసాలకు అలవాటుపడి 2016లో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి ప్రముఖులతో సెల్ఫీలు దిగి.. వారితో పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. విప్రో కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నానని, సంస్థలో మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడసాగాడు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట మోసం.. - సాఫ్వేర్ ఉద్యోగాల పేరిట మోసం..
తాను పనిచేసే సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బుల వసూలు చేసిన నిందితుడిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరైనా ఉద్యోగాల పేరిట డబ్బులు డిమాండ్ చేస్తే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు.
గత ఏడాది జులైలో సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్‌లోని లాడ్జిలో అద్దెకు దిగాడు. అతడు అక్కడున్న వారిని మంచి చేసుకున్నాడు. విప్రోలో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించాడు. లాడ్జి నిర్వాహకుడు సురేష్‌తో పరిచయం కాగా అతడి బంధువులకు ఉద్యోగాలను ఇప్పిస్తానని నకిలీ అపాయిమెంట్ ఆర్డర్లను తయారు చేసుకుని వచ్చి ఉద్యోగం వచ్చినట్లు నమ్మించి వారి నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు. మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీచూడండి: ఉద్యోగాలిప్పిస్తామంటూ... నిరుద్యోగులకు ఎర