తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండుకుండలా ఫాక్స్​సాగర్... అలుగు పోస్తే దిగువ ప్రాంతాలకు ముప్పు

ఫాక్స్​సాగర్‌ చెరువు దాదాపు 20 ఏళ్ల తర్వాత నిండుకుండను తలపిస్తోంది. వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతుండగా... పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువవుతోంది. చెరువు అలుగు పోస్తే దిగువకు నీరు వెళ్లటానికి దారి లేదు. ఒకవేళ ఆ పరిస్థితి తలెత్తితే దిగువ ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది.

నిండుకుండలా ఫాక్స్​సాగర్... అలుగు పోస్తే దిగువ ప్రాంతాలకు ముప్పు
నిండుకుండలా ఫాక్స్​సాగర్... అలుగు పోస్తే దిగువ ప్రాంతాలకు ముప్పు

By

Published : Oct 15, 2020, 10:31 PM IST

హైదరాబాద్ జీడిమెట్ల ఫాక్స్​సాగర్ చెరువుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 37 అడుగులు కాగా... ప్రస్తుతం 33 అడుగులకు చేరింది. ఇలాగే వరద కొనసాగితే... దిగువన ప్రాంతాలైన సుభాశ్ నగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, షాపూర్​నగర్​కు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

మరో నాలుగు అడుగులు...

చెరువుకి మరో నాలుగు అడుగుల మేర వరద చేరితే... కట్టపై నుంచి ప్రవహించే ప్రమాదం ఉంది. ఇప్పటికే చెరువు సమీపంలోని ఉమామహేశ్వరకాలనీ జలదిగ్భందంలో ఉండగా... 600 కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి.

చేపల మృత్యువాత...

కట్టవద్ద ఉన్న మత్స్యకారుల 10 గుడిసెలు పూర్తిగా నీట మునిగాయి. వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎగువన వరదకు డ్రైనేజీ నీరు, స్థానిక పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు కలుస్తున్నాయని... అందువల్ల చేపలు మృత్యువాత పడుతున్నాయని వారు వాపోయారు. ఫాక్స్​సాగర్‌ చెరువు నిండుకోవడం వల్ల స్థానిక ఎమ్మెల్యే వివేకానంద పరిశీలించారు. అధికారులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి:వర్షాలు తగ్గినా కొనసాగుతోన్న వరద ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details