హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో రూ.48.49 లక్షల విలువైన కిలోకు పైగా బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో గురువారం ఉదయం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ప్రయాణీకులను అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించారు.
నల్లటి బంతి రూపంలో..
వారిలో ఇద్దరు ప్రయాణికుల నుంచి 4 దీర్ఘ చంద్రకారంలో ఉన్న నల్లటి బంతులను స్వాధీనం చేసుకున్నారు. ముద్ద రూపంలో బంగారం తెచ్చినట్లు గుర్తించి వేరు చేయగా రూ.1235.44 గ్రాముల బంగారం బయట పడింది. అదుపులోకి తీసుకున్న ప్రయాణికులను విచారించగా.. పసిడి అక్రమ తరలింపే తమ దినచర్యగా చెప్పినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ముంబయి విమానాశ్రయంలో ఓ వ్యక్తి తమకు బంగారాన్ని అందచేసినట్లు పేర్కొన్నారు.